ఈ నెల 24న చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం
posted on Apr 18, 2012 12:03PM
ప్రముఖ నటుడు రాజకీయనాయకుడు చిరంజీవి ఈ రోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆయన తెలిపారు.పార్టీలో కీలక నేతల మధ్య భేదాభిప్రాయాలు సహజమని దాన్ని సంక్షోభంగా భావించరాదని అన్నారు. నేతల మధ్య భేదాభిప్రాయాలు తొలగించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం అయినా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిసిపోయేందుకు ఇంకా సమయం పడుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈరోజు చిరంజీవి వాయలార్ రవి అల్పాహార విందు ఇచ్చారు, అల్పాహార విందు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన రవి కాంగ్రెస్ పార్టీలో అతిముఖ్య నేతల్లో చిరంజీవి ఒకరని రవి ప్రశంసించారు. చిరంజీవి సేవలను దేశవ్యాప్తంగా ఉపయోగించుకుంటామని తెలిపారు.