అన్నపై ఎదురుదాడికి దిగిన ధర్మాన

శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట ఉపఎన్నికలు ధర్మానసోదరులు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున తాజా మాజీ, ధర్మాన కృష్ణదాస్ పోటి చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ తరుపున చిన్నసోదరుడు ధర్మాన రామదాసు తలపడుతున్నారు. నిన్న మొన్నటి వరుకూ తన తమ్ముడు, మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావుపై అన్న కృష్ణదాసు ఒంటికాలిపై లేస్తూ చిటికిమాటికి విమర్శలు గుప్పించేవారు. తమ్ముడు తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని తనను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తన కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు సీను మారింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు తన అన్నగారిపై విమర్శనాస్త్రలను సందిస్తున్నారు. కేవలం పదవికాంక్షతోనే ధర్మాన కృష్ణదాస్ జగన్ పంచన చేరారని అంటున్నారు. నరసన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడన్నఉద్దేశ్యంతోనే గత ఎన్నికల్లో కృష్ణ దాసుకు టికెట్టు ఇప్పించి గెలిపించానని,కానీ ఆయన విశ్వసఘతకానికి పాల్పడి నరసన్నపేట ప్రజలను నట్టేట ముంచారని ధర్మానప్రసాదరావు ఆరోపిస్తున్నారు. కృష్ణదాసు ఆలోచనతీరు సరిగాలేదని విమర్శించారు. ఆయనను మళ్ళీ గెలిపిస్తే నియోజకవర్గ ఓటర్లను మరోసారి మోసం చేయరనే గ్యారెంటి ఏమి లేదని అయన హెచ్చరిస్తున్నారు. నియోజక వర్గ౦ అన్ని రంగాలలో అభివృద్ధి సాధీంచాలంటే కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలని అయన వోటర్లను కోరుతున్నారు. సోదరుల మధ్య ఏర్పడిన ఈ రాజకీయ చిచ్చు కుంటుంబ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu