సస్పెన్షనే... అధికార పార్టీ ఆయుధం
posted on Oct 5, 2015 12:42PM
రైతు ఆత్మహత్యలపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడతాయని ముందే ఊహించిన అధికార పార్టీ... సస్పెన్షన్ ను ఆయుధంగా వాడుకోవాలని ముందే డిసైడైంది, రెండ్రోజులపాటు అసెంబ్లీ కూల్ గా జరిగినా, మూడోరోజు విపక్షాలు విశ్వరూపం చూపించడంతో, ముందుగా అనుకున్నట్లుగా కేసీఆర్ సర్కార్ సస్పెన్షన్ అస్త్రాన్ని బయటికి తీసింది, అన్నదాతల ఆత్మహత్యలపైనే చర్చించాలని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులంతా పట్టుబట్టడంతోపాటు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగడంతో ఏకంగా 32మంది ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేసేశారు. దాంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది, కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అసెంబ్లీని హోరెత్తించారు. టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ కూడా జత కలవడంతో అధికారపక్షం డిఫెన్స్ లో పడింది.