మూడు రోజులు భారీగా ఎండ తీవ్రత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

 

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ముఖ్యంగా తెలంగాణ లోని పలు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ.. తీవ్ర ఉక్కపొతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత రెండు వారాలుగా ఎండ తీవ్రతలు అధికంగా ఉండటంతో 30 మంది వరకు వడదెబ్బ కారణంగా మరణించారు. అలాగే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్ర అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ  అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాల్పులు వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎటువంటి బయట పనులు పెట్టుకోవద్దని సూచించిచారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొవాలని, నిత్యం శరీరానికి నీటిని అందించాలని, ముఖ్యంగా పండ్ల రసాలను తీసుకొవాలని తెలిపారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu