టీఆర్‌ఎస్‌కు ఎర్రబెల్లి విజ్ఞప్తి

హైదరాబాద్: తెలంగాణపై చిత్తశుద్ధి లేకుండా మాట్లాడవద్దని టీఆర్‌ఎస్‌కు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు బహిష్కరిస్తే కేంద్రం దిగివస్తుందని అన్నారు. బాన్సువాడ ఉప ఎన్నికలో నామినేషన్లు వేయకుండా పార్టీలు చిత్తశుద్ధి చాటుకోవాలని సూచించారు. తెలంగాణ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని అన్నారు. గురువారం మధ్యాహ్నం టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎవరో చెబితే రాజీనామాలు చేయబోమని అన్నారు. తమను రాజీనామా చేయమనడానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఎవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ పేరు చెప్పుకుని కేసీఆర్ కుటుంబ సభ్యులు పదవులు పంచుకున్నారని దయాకరరావు విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu