తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయ్

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలు జూన్ తర్వాత ఎప్పుడైనా రావొచ్చు.  షెడ్యూల్డ్ విడుదల చేసిన తర్వాత  ఎన్నికల కోడ్ అమలులో వస్తుంది. ఎన్నికల కమిషన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖలను ఎన్నికల కమిషన్  తన ఆధీనంలో  ఉంచుకోవచ్చని తెలుస్తోంది. 
  అసెంబ్లీ గడువుకు ముందు ఆరు నెలలలోపు  ఎన్నికలు రాష్ట్రంలో నిర్వహించాలని ఎన్నికల కమీషన్ యోచిస్తోంది. నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలో నైనా అసెంబ్లీ గడువు  ముగియడానికి ఆరునెలల ముందే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. కాబట్టి ఎన్నికల సంఘం జూన్ లో నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. 
 
రెండు రోజుల క్రితం ఎన్నికల అధికారులు ఎన్నికల సన్నాహాలను సమీక్షించారని తెలుస్తోంది. 
మరో వైపు తెలంగాణలో ముఖ్యమంత్రికి ఎక్కువ సమయం అవకాశం ఇవ్వకూడదని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల నిబంధలను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది. 

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరింత రాణించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే మూడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ కు చుక్కలు చూపించాలని యత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత చిక్కుకోవడం, పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీక్ వ్యవహారాన్ని సానుకూలంగా మార్చుకోవాలని బీజేపీ యోచిస్తుంటే , 10వ తరగతి పేపర్ లీక్ లో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చిక్కుకోవడం బీఆర్ఎస్ కు సానుకూల అంశంగా మారింది. 
దేశంలో సార్వత్రిక ఎన్నికలతో బాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. 
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆలోచిస్తుంది. 

ఇదిలా వుండగా భారత ఎన్నికల కమిషన్ తెలంగాణలో రానున్న ఎన్నికల నేపథ్యంలో సమీక్ష నిర్వహించింది. డిప్యూటి ఎన్నికల కమిషనర్ నితీష్ కుమార్ పర్యవేక్షణలో ముగ్గురు అధికారులు ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి విశ్వ జిత్ తో గత శనివారం నితీష్ కుమార్  సమీక్ష నిర్వహించారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu