ఖైదీ రేవంత్ రెడ్డి నెం 1779..

అవినీతి ఆరోపణ కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎసీబీ అధికారులు నిన్నఅరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే అక్కడ రేవంత్ రెడ్డికి ఖైదీ నెంబరు 1779 కేటాయించారు. కోర్టు అనుమతితో ఈ రోజు జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకొనిన అనంతరం పోలీసులు మళ్లీ ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు.