రఘువీరాఫై తెదేపా విమర్శలు
posted on Nov 20, 2011 3:19PM
హై
దరాబాద్: మంత్రి రఘువీరాకు డాక్టరేట్ ప్రదానం చేయడం పట్ల తెలుగుదేశం విమర్శలు చేసింది.రఘువీరా హయంలో అత్యదికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకే ఆయనకు డాక్టరేట్ ఇచ్చి గౌరవిస్తున్నారా అని తెదేపా సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు ఎద్దేవా చేశారు . మేఘమదనం పేరిట ప్రజల సొమ్మును దోచుకున్నందుకు,రైతులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పంట విరామం ప్రకటిచినందుకు డాక్టరేట్ అందుకున్తున్నారా అని ప్రశ్నించారు.
కాగా కేవీపీ రామచంద్రరావుకు సిబీఐ విచారణ నుంచి ఎందుకు మినహాయింపునిచ్చారని తెదేపా ప్రశ్నించింది.జగన్ అక్రమార్జనకు సంబంధించి పూర్తీ వాస్తవాలన్ని కేవీపీకీ తెలుసునని తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు.ఇప్పటికే చంద్రబాబు జీవితాన్ని 116 సార్లు చదివేసారన్న అయన ఇకనైనా అవినీతిపరుల జీవితాన్ని చదివితే బాగుంటుందన్నారు.