ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యహరిస్తోంద: జగన్

జొన్నలగడ్డవారిపాలెం: గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదివారం మధ్యాహ్నం జొన్నలగడ్డవారిపాలెం చేరుకుని  వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనతరం  ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అయన అన్నారు. నీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ఎకరాకు 30 బస్తాలు పండాల్సివుండగా కనీసం10 బస్తాలు పండవేమోనన్న భయం రైతుల్లో ఉందని అన్నారు. రైతు పీకల్లోతు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యహరిస్తోందని జగన్ విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu