'రాష్ట్ర విభజనపై ఆలస్యం మంచిది కాదు'

నెల్లూరు: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆలస్యం చేయడం మంచిదికాదని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ అన్నారు. తెలంగాణ నిర్ణయం ఒప్పందంలో ఉల్లంఘన జరగడం వల్లే ప్రత్యేక రాష్ట్రవాదం వచ్చిందన్నారు. అభివృద్ధితో ప్రాంతీయ వాదాన్ని నివారించాలనుకోవడం సరికాదన్నారు. ప్రజల విశ్వాసం ఉన్న నేతలు కరువయ్యారని ఆయన వాపోయారు.తెలంగాణ సాధన కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని లక్ష్మణ్‌బాపూజీ కోరారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu