మహానాడులో తెలంగాణ తీర్మానం

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మహానాడు కార్యక్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇందులో తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ గతంలో చెప్పిన నిర్ణయానికే కట్టుబడి ఉందని, అయితే తెలంగాణపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం కేంద్రానిదే అని స్పష్టం చేస్తూ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు రాజకీయ తీర్మానం ప్రవేశ పెడితే టిడిపి ఏకగ్రీవంగా ఆమోదించింది. కాగా మహానాడు మూడో రోజు  పలు తీర్మానాలను పార్టీ ఆమోదించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu