కేసీఆర్ పట్టించుకోరు.. చంద్రబాబుకు 3 కోట్లిస్తా.. తలసాని
posted on Sep 29, 2015 5:34PM
టీడీపీ పార్టీలో గెలుపొంది టీఆర్ఎస్ పార్టీలో పదవి అనుభవిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీడ్రామాపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అలాంటిది ఇప్పుడు తాను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపని.. సనత్ నగర్ నియోజక వర్గం నుండి తానే గెలుస్తానని.. తాను ఇంట్లో ఉండి కూర్చొని గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఓటములను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్టించుకోరని తలసాని చెప్పారు. అంతేకాదు నారా లోకేశ్ తమ ఆస్తి వివరాలు తెలిపిన నేపథ్యంలో తలసాని దాని గురించి ప్రస్తావించారు. చంద్రబాబు ఇంటి విలువ కేవలం రూ 23 లక్షలేనా.. నేను రూ.3 కోట్లు ఇస్తాను చంద్రబాబు తన ఇంటిని అమ్మేస్తారా అని ప్రశ్నించారు. వారు తెలిపిన ఆస్తుల వివరాలు అంతా ఒట్టిదే అని విమర్శించారు.