ఈ ఏడాది పెద్ద నేతకు గండం! స్వరూపానంద జోస్యంతో కలకలం 

తెలుగు రాష్ట్రాల్లో ఉగాడి వేడుగలు వైభవంగా జరుగుతున్నాయి. పంచాంగ శ్రవణం వింటూ తమ భవిష్యత్ గురించి తెలుసుకుంటున్నారు జనాలు. విశాఖలోని శ్రీశారదాపీఠంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. పీఠం ఆధ్వర్యంలోని గంటల పంచాంగాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర చెప్పిన జోస్యం కలకలం రేపుతోంది. 

ప్లవ అంటే చీకటిని పారదోలి వెలుగులు నింపడమన్నారు స్వరూపానందేంద్ర స్వామి. శార్వరి, వికారిలా కాకుండా ప్లవ నామ సంవత్సరంలో శుభాలు కలగాలని కోరుకుందామన్నారు. అయితే ఈ ఏడాది ఓ పెద్ద నేతకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని స్వామి జోస్యం చెప్పారు. స్వరూపానందేంద్ర జోస్యం తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. ఆయన చెప్పిన పెద్ద నేత ఎవరన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరంటూ రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 

ఈ ఏడాది ఇబ్బందులు పడే నేత కేంద్రానికి చెందిన నేతా, రాష్ట్రానికి చెందిన నేతా... తెలుగు నేతా... దక్షిణాది, ఉత్తారది వారా అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. స్వామిజీ చెప్పిన నేత ఎవరై ఉండొచ్చు... ఆయనకు ఎదురయ్యే ఇబ్బందులు ఏమై ఉండొచ్చు అంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఏపీ సీఎం జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు కూడా ఇదే విషయం చెబుతున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీంతో  స్వరూపానందేంద్ర చెప్పిన జోస్యం ఆసక్తిగా మారింది.