వేటు వేస్తే సగం ఖాళీ: సబ్బం హరి
posted on Apr 23, 2011 3:38PM
కడప: శాసన
సభ్యులపై అనర్హత వేటు వేసే ప్రక్రియను కొనసాగిస్తే శాసనసభ సగం ఖాళీ అవుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న నలుగురు శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరడంపై ఆయన ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ఆ విధంగా అన్నారు. చర్యలు తీసుకునే అధికారం అఖిల భారత కాంగ్రెసు కమిటీ (ఎఐసిసి)కి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెసుతో తెగదెంపులేనని ఆయన అన్నారు. మార్పులున్నాయి కాబట్టే కడప ఉప ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కడప ఉప ఎన్నికల వల్ల ఏ విధమైన మార్పులు చోటు చేసుకోవని ఆయన అన్నారు.