సోనియాపై మండిపడ్డ రోజా
posted on Apr 23, 2011 3:34PM
కడప: కాంగ్రెస్ అధినేత్రి సోనియా
గాంధీపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆస్తి కోసం సొంత తోటికోడలు మేనకా గాంధీని సోనియా గాంధీ ఇంటి నుంచి వెళ్లగొట్టారని రోజా ఆరోపించారు. తన భర్తను చంపించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీకి మద్దతు తెలిపి నీచరాజకీయం చేసింది సోనియానే అని ఆమె అన్నారు. రాజీవ్ గాంధీని ఉరి తీయాలని లోక్‌సభలో డిమాండ్ చేసిన జైపాల్‌రెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టి తన పక్కన కూర్చొబెట్టుకున్న ఘనత సోనియాకే చెందుతుందన్నారు. సొంత జిల్లాలో ఎమ్మెల్సీని గెలిపించుకోలేని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కడపలో ఏం చేస్తారని ఆమె ప్రశ్నించారు. తన పదవిని కాపాడుకోవడానికి సీఎం మంత్రులను కడపలో కాపురం పెట్టించారన్నారు. జగన్ మడమ తిప్పని, మాట తప్పని నాయకుడు అని రోజా కితాబిచ్చారు.