సుష్మకి మరో పాకిస్థానీ అభ్యర్ధన...

 

తనను సాయం అడిగిన వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సాయం చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో మరోసారి పాకిస్థాన్ నుండి తనకు సాయం చేయాలని అభ్యర్దన వచ్చింది. ఇటీవలే పాకిస్థానీతో బలవంతపు వివాహమై ఇబ్బందులు ఎదుర్కొన్న ఉజ్మా అనే భారతీయురాలికి సాయం చేసి భారత్ కు వచ్చేలా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా.. ఓ పాకిస్థానీయే తనకు సాయం చేయాలని సుష్మను కోరాడు. పాకిస్థాన్‌లోని లాహోర్‌కి చెందిన ఓ సివిల్‌ ఇంజినీర్  గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతనికి నెలల పనికందు ఉండగా... ఆ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. భారత్‌లో చికిత్స చేయించడానికి వీసా వచ్చేలా సాయం చేయడంటూ సుష్మాను ట్విటర్‌ ద్వారా కోరాడు. ‘భారత్‌, పాక్‌ ఘర్షణల కారణంగా నా బిడ్డ ఎందుకు బాధపడాలి. సర్తాజ్‌ అజీజ్‌, సుష్మా మేడమ్‌.. చెప్పండి’ అని సుష్మాని ప్రశ్నించాడు. ఇక దీనిపై స్పందించిన సుష్మ అతని భరోసా ఇస్తూ సమాధానం చెప్పారు. ‘లేదు. నీ బిడ్డకు ఎలాంటి కష్టం రాదు అని ధైర్యం చెప్పి.. ముందు పాక్‌ హైకమిషన్‌ను సంప్రదించండి... ఆ తర్వాత మెడికల్‌ వీసా వచ్చేలా చూస్తాం’ అని హామీ ఇచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu