సుప్రీం తీర్పు రాష్ట్రానికి కాదు
posted on May 30, 2011 4:33PM
హైదరాబాద్
: బిసిల రిజర్వేషన్లు రాష్ట్రంలో యథావిధిగా కొనసాగుతాయని బిసిలకు రిజర్వేషన్లలో కోత పెట్టే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని మంత్రులు బస్వరాజు సారయ్య, పితాని సత్యనారాయణ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. బిసి రిజర్వేషన్లపై మంత్రి వర్గం ఉప సంఘం భేటీ అయి చర్చించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. బిసిలకు ఇప్పుడున్నట్టుగానే రిజర్వేషన్లు కొనసాగుతాయని బిసిలు ఎలాంటి అధైర్యం చెందవద్దని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్రానికి వర్తించదని అది కేవలం కర్నాటకకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. గతంలో నిర్వహించినట్టుగానే ఈసారి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని వారు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు.