హైదరాబాద్ పర్యటనలో రామ్ నాథ్ కోవింద్... కేసీఆర్ ఘనస్వాగతం...
posted on Jul 4, 2017 1:25PM

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 17న రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. దిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రామ్‌నాథ్‌కు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు, భాజపా నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రామ్‌నాథ్ నేరుగా హరిత ప్లాజాకు చేరుకుని భాజపా నేతలతో సమావేశమయ్యారు.ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రామ్‌నాథ్ కోవింద్ కు స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు కేకే, జితేందర్‌రెడ్డి కూడా ఆయనను స్వాగతించనున్నారు. జలవిహార్‌లో తెరాస నేతలతో కోవింద్ హాజరయ్యారు.