అమెరికాలో అడ్డా కూలి గంట జీతం కంటే.. సునీతా విలియమ్స్ వేతనం తక్కువా?

సునీతా విలియమ్స్.. పరిచయం అక్కర్లేని పేరు. తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమె ఇప్పుడు తిరిగి వస్తున్నారు. అంత కాలం దుర్భర స్థితిలో అసలు తిరిగి వస్తానా రానా అన్న స్థితిలో గడిపిన ఆమెకు ఇచ్చే పరిహారం ఎంతో తెలుసా రోజుకు కేవలం నాలుగు డాలర్లు. అదే అమెరికాలో అడ్డాకూలికి గంటకు 15 డాలర్ల వేతనం దక్కుతుంది. సునీతా విలియమ్స్ కు నాసా ముట్ట చెప్పేది మాత్రం కేవలం రోజుకు కేవలం నాలుగు డాలర్లు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లి చదువు కుంటూ పని చేసే మన వాళ్లకు కూడా అక్కడ గంటకు 15 డాలర్ల వేతనం వస్తుంది. వారి కంటే కూడా సునీతా విలియమ్స్ కు దక్కేది నాలుగు డాలర్లు మాత్రమే.  

తొమ్మిది నెలల పాటు అనివార్య పరిస్థితుల్లో అంతరిక్షంలో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే త్రిశంకు స్వర్గంలాటి స్థితిలో చిక్కుకుపోయి.. అసలు తిరిగి  భూమిని చేరుకుంటామా లేదా అన్న ఆందోళనతో గడిపిన వ్యోమగాములు సునీతా విలియమ్స్,  బుచ్ విల్మోర్ లు ఎట్టకేలకు భూమికి దిగి వస్తున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం  వారు భువికి చేరుకుంటారు. ఇంతటి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడటం శుభపరిణామమే. వారి తిరిగి రావాలని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కోరుకున్నారు. ప్రార్థనలు చేశారు.   ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలలు అక్కడే చిక్కుకుపోయారు. సాంకేతిక సమస్యలతో ఆమె అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఎట్టకేలకు స్పేస్ఎక్స్ డ్రాగన్ ఐఎస్ఎస్ తో విజయవంతంగా అనుసంధానం కావడంతో సునీతా విలియమ్స్, ఆమెతో పాటు వెళ్లినబుచ్  విల్లోర్ లు ఎట్టకేలకు భూమికి చేరడానికి మార్గం సుగమమైంది. అయితే ఇంత కాలం అనివార్యంగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వారికి నాసా వారి జీత భత్యాలు కాకుండా అదనంగా పరిహారం ఏమైనా చెల్లిస్తుందా? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. వాస్తవంగా వ్యోమగాములకు జీతం కోట్లలోనే ఉంటుంది.

అయితే వారికి ఓవర్ టైమ్ అంటూ ప్రత్యేక చెల్లింపులు ఏమీ ఉండవు. కానీ అనూహ్య పరిస్థితుల్లో ఇలా చిక్కుకుపోయినందున నాసా సునీతా విలిమ్స్ కు అదనంగా రోజుకు నాలుగు డాలర్లు చెల్లించనుంది. ఆశ్చర్య పోకండి నిజంగా నిజం. తొమ్మది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకు పోయి, అసలు తిరిగి రాగలుగుతారా రారా అన్న భయాందోళనల మధ్య గడిపినందుకు సునీతా విలిమ్స్ కు నాసా చెల్లించే అదనపు వేతనం లేదా పరిహారం రోజుకు కేవలం నాలుగు డాలర్లు. అంటే సుమారుగా రోజుకు 348 రూపాయలు. ఇది అమెరికాలో అడ్డాకూలీలకు వచ్చే గంట వేతనం కన్నా కూడా తక్కువ. మొత్తం మీద తొమ్మది నెలలు అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ కు దక్కే అదనపు సోమ్ము మన కరెన్సీలో చెప్పాలంటే కేవలం లక్ష రూపాయలు మాత్రమే.