యాదగిరి గుట్టను దర్శించుకున్న మిస్ యూనివర్స్ 

యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహా స్వామిని మిస్ యూనివర్స్  విక్టోరియా కెజా దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులైన చీరతో మంగళవారం ( మార్చి 18) ఆమె ఆలయానికి చేరుకున్నారు. డెన్మార్క్ కు చెందిన  విక్టోరియా కెజా భారతీయ సాంప్రదాయం ప్రకారం చీర కట్టుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఆమెను అధికారులు స్వాగతించారు. విక్టోరియా కెజా ప్రత్యేక పూజలు నిర్వహించారు.   యాదగి రి గుట్ట తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం. భక్తులకు, పర్యాటకులకు ఆకర్షించే క్షేత్రం కావడంతో దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది.  విక్టోరియా కెజా 2024లో మిస్ యూనివర్స్ టైటిల్ ను సొంతం చేసుకున్నారు.  డ్రగ్స్ కు అలవాటు పడ్డ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె అత్యాచార బాధితురాలు. డాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన విక్టోరియా కెజా అందాల పోటీల్లో పాల్గొంటూ మిస్ యూనివర్స్ విజేతగా ఎదిగారు.