విజయవాడ వెస్ట్ లో సుజనా విజయం సునాయాసం

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనాచౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ నుంచి సుజనా చౌదరి పేరు ప్రకటించగానే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

పొత్తులో భాగంగా తెలుగుదేశం లేదా జనసేన నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి రంగంలోకి దిగడంతోనే పరిస్థితి ఒక్కసారిగా కూటమికి అనుకూలంగా మారిపోయింది. విజయవాడ వెస్ట్ నుంచి మంత్రి వెల్లంపల్లిని మార్చి వైసీపీ వ్యూహాత్మకంగా ఆసిఫ్ ను రంగంలోకి దింపింది. అయితే అంతకు మంచిన వ్యూహం అన్నట్లుగా కూటమి అభ్యర్థిగా సుజనా రంగంలోకి దిగారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ డీలా పడింది.  నాన్ లోకల్ అంటూ సుజనా చౌదరికి వ్యతిరేక ప్రచారం చేయడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు ఆదిలోనే విఫలమయ్యాయి.  
అందరితోనూ కలిసిపోతూ, అందరినీ కలుపుకుని పోతూ సుజనా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పటికే సుజనా నియోజకవర్గ పరిిలోని ప్రతి డివిజన్ లోనూ ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. దాదాపుగా ప్రతి ఇంటి తలుపూ తట్టారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంతో తాను ముందుంటానని స్పష్టమైన హామీ ఇస్తున్నారు. నియోజకవర్గ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానన్న విశ్వాసాన్ని ప్రజలలో కలిగించారు.  

దీంతో సుజనా చౌదరి నాన్ లోకల్ అంటూ ముద్ర వేయడానికి వైసీపీ చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైంది.  స్థానిక సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ రూపొందించి ముందుకు సాగుతానని హామీ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు ప్రొగ్రెస్ రిపోర్టు కూడా ఇస్తానని  చెప్పడం ద్వారా వైసీపీ నోటికి తాళం వేయగలిగారు. తాను స్థినికేతరుడిని కాననీ ప్రజల మనిషినని బలంగా చాటారు.  ఇక  కుల, మతాలకు అతీతంగా ఉంటానని చెప్పడం ద్వారా అన్ని వర్గాలతో మమేకం కాగలిగారు.

సుజనాకు వస్తున్న ప్రజాదరణను చూసి  వైసీపీ నుంచి భారీగా నాయకులు బీజేపీలో చేరారంటేనే వైసీపీ ఎంతగా డీలా పడిందో అర్ధం చేసుకోవచ్చు.  మైనారిటీలు కూడా  కూటమికి మద్దతు ప్రకటించి సుజనా వెంట ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ పోలింగ్ కు ముందే సుజనా విజయాన్ని ఖరారు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్థానికంగా కూడా విజయవాడ వెస్ట్ లో వార్ వన్ సైడేనన్న టాక్ బలంగా వినిపిస్తోంది.