ఆ పాపం ఎ2 విజయసాయిదే... అందుకే...!

జగన్ ప్రభుత్వ పుట్టికి ఆల్రెడీ ఓటర్లు చిల్లు పెట్టేశారు. మెల్లమెల్లగా నీళ్ళు లోపలకి వస్తున్నాయి. జూన్ 4వ తారీఖున జగన్ ప్రభుత్వ పుట్టి ‘మునిగిపోవడం’ ఖాయమని ‘తేలిపోయింది’. జగన్ ప్రభుత్వం మీద ప్రజల్లో మొదటి నుంచే వ్యతిరేకం వుంది. తాను ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలు చాలా హ్యాపీగా వున్నారని, తాను, తన దండుపాళెం బ్యాచ్ ఎన్ని పనికిమాలిన వేషాలు వేసినా జనం తనకు ఓట్లు వేస్తారని కలలు కన్న జగన్‌కి జనం బుద్ధి చెప్పేశారు. జగన్ పరిపాలన తీరు ఎన్నో విషయాలలో జనానికి నచ్చలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన నెల నుంచే ‘జగన్ మరోసారి అధికారంలోకి వస్తే అడుక్కు తినడమే.. ఈ ఐదేళ్ళూ భరించక తప్పదు’ అనే ఆలోచనకి జనం వచ్చేశారు. ఈసారి జగన్ బుడుంగ్‌మనడానికి కారణం అతని ప్రభుత్వ అవినీతి, అక్రమాలతోపాటు ముఖ్య కారణంగా చెప్పుకోవలసింది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ యాక్ట్ ద్వారా తమ భూములకు మొగుడై కూర్చుంటాడన్న భయం జనాన్ని వేధించింది. అందుకే అతన్ని సాగనంపేలా తీర్పు చెప్పారు.

‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’ తన కొంప ఇంతలా ముంచుతుందని జగన్ ఎంతమాత్రం ఊహించలేకపోయారు. ఈ చట్టాన్ని తేవడం ఇంత ఘోరం చేస్తుందని తెలిస్తే దానిజోలికే వెళ్ళేవాడు కాదన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్‌కి అంత ఇంట్రస్ట్ లేదట. ఏ2 విజయసాయిరెడ్డి ఒత్తిడి కారణంగానే ఈ చట్టాన్ని జనం మీద రుద్దడానికి జగన్ ఒప్పుకున్నారట. అలాగే రైతుల పట్టాదార్ పాసు పుస్తకాల మీద, భూముల సరిహద్దు రాళ్ళ మీద జగన్ ముఖారవిందం వుండాలన్న ఐడియా కూడా విజయసాయిరెడ్డిదేనట. అప్పుడు పట్టాదార్ పాస్ బుక్ వ్యవహారం, ఇప్పుడు లాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం... ఈ రెండూ జగన్ మీద రైతుల్లో వ్యతిరేకత పెంచాయి. ఎలక్షన్లలో సీన్ రివర్స్ అయ్యేలా చేశాయి. 

పోలింగ్ ముగిసిన తర్వాత ఓటరు నాడిని అర్థం చేసుకున్న జగన్ విజయసాయిరెడ్డికి చాలా సీరియస్‌గా క్లాస్ పీకినట్టు సమాచారం. నేను వద్దు మొర్రో అంటున్నా, అద్భుతాలు చేయొచ్చంటూ నన్నుఒప్పించావు. రేపు నేను ఓడిపోతే నువ్వే కారణం అని ఆగ్రహం వ్యక్తం చేశాడట. దాంతో చిన్నబుచ్చుకున్న విజయ సాయిరెడ్డి పోలింగ్ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu