నెల్లూరు పార్లమెంటు పరిథిలో ఓటు రూ. 1000?

నెల్లూరు పార్లమెంటు స్థానానికి జరుగుతున్నా ఉప ఎన్నికల్లో పోటీ చేసే నాయకులందరూ ఆర్థికంగా హేమాహేమీలు కావడం వల్ల ఓటర్లు ఎన్నికలకు వారు పెట్టే ఖర్చుగురించే మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల కంటే ఎన్నికలలో ప్రాధాన రాజకీయపార్టీల తరపున పోటీ చేసే తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒంటరు వేణుగోపాల రెడ్డి అభ్యర్థుల ఆర్ధిక సామర్థ్యం గురించే ప్రజలు ఎక్కువగా చెప్పుకుంటున్నారు. ఓటుకి 500 రూపాయలు ఇస్తారని ఒకరు చెబుతుంటే ఆటకు 1000 రూపాయలు ఇస్తారని మరొకరు చెప్పుకుంటున్నారు. డబ్బును వ్యక్తిగతంగా ఇస్తారని కొందరు చెప్పుకొంతుంటే కుటుంబంలోని సభ్యులను బట్టి కుటుంబాల వారీగా డబ్బు ఇస్తారని మరికొందరు ఆశగా చెప్పుకుంటున్నారు. ఓట్లకోసం భారీగా డబ్బు ఖర్చుచేస్తున్నారనే వార్తలతో చోటా నాయకులు ఎలక్షన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ సామాజికవర్గానికి ఇన్ని ఓట్లు వున్నాయి ... మా కులపోళ్ళు మీకు ఓటు వేయాలంటే ఈ గుడి కట్టించాలి ... ఈ చర్చి కట్టించాలి ... ఈ మసీదు కట్టించాలి లేదా ఫలానా సదుపాయాలూ కల్పించాలని కోరుతున్నారు. వీరి మాటలకు నేతలు కూడా సై అంటున్నారని తెలిసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu