పరకాలలో కారుకు పంక్చర్ తప్పదంటున్న తెలుగు తమ్ముళ్ళు

పరకాల ఉప ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడుతున్నప్పటికీ టి.డి.పి.. టి.ఆర్.ఎస్. పార్టీ నాయకులు మాత్రం ఒకరిపై మరొకరు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా టి.ఆర్.ఎస్. నేత హరీష్ రావు ప్రతి సమావేశంలోనూ టిడిపి విధానాలను ఘాటుగా విమర్శిస్తున్నారు. విభజనే సిద్ధాంతంగా (తెలంగాణా సొమ్ము దండుకుని) బతికే పార్టీకి హరీష్ రావుకు తమ పార్టీని విమర్శించే అర్హతలేదని టిడిపి నాయకులు అంటున్నారు. జాతీయ, రాష్ట్ర పార్టీలకు ఉన్న తేడా హరీష్ రావుకు కనబడటం లేదని వారు ధ్వజమెత్తారు. రెండు కళ్ళ సిద్ధాంతి చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే దయాకరరావు, ఆంధ్రోళ్ళ మనిషి అని ఘాటుగా విమర్శించానానుకుని పొంగిపోతున్న హరీష్ రావు కళ్ళుఉన్న కబోది లాంటివాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ చేతకాకే ఢిల్లీలోని ఆంధ్రాభవన్ సిబ్బంది (అదీ ముసలి వయస్సులో ఉన్న వ్యక్తి)పై హరీష్ రావు చేయి చేసుకున్నారని గతాన్ని గుర్తు చేశారు. ఇదే పోకడతో హరీష్ రావు ముందుకు పొతే కతినమైన ముళ్ళు కారు టైరుకు గుచ్చుకుని పంక్చర్ అవటం ఖాయమని తెలుగుతమ్ముళ్ళు హెచ్చరిస్తున్నారు. పాలమూరు ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. చావుదెబ్బ తినడాని అటువంటి దెబ్బే మరోసారి పరకాలలో తినాల్సి వస్తుందని టిడిపి నాయకులు హెచ్చరిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu