కాలేజిలో స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్
posted on Oct 13, 2012 11:13AM
.jpg)
పాలిటెక్నిక్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిపైన విద్యార్ధి నేతలు సాముహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో బయటపడింది. తన కూతురిపై సాముహిక అత్యాచార౦ జరిపిన వారిలో తృణమూల్ కాంగ్రెసు ఛత్ర పరిషత్ నేత సామ్యో మండల్ ఉన్నట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూనియర్ స్టూడెంట్ ను గదిలోకి తీసుకొనివెళ్ళి మద్యం తాగించే ప్రయత్నం చేశారని, దానికి ఆమె నిరాకరించడంతో ఆమె బట్టలు విప్పి సెల్‌ఫోన్లలో చిత్రీకరించి ఆ తరువాత అత్యాచారం చేశారని బాధితురాలి తండ్రి చెప్పాడు. ఐదుగురు నిందితుల్లో సెక్యూరిటీ గార్డ్ భోల్ యాదవ్ కూడా ఉన్నాడు. మరో నలుగురు నిందితులు మండల్, అవిక్ ఘోష్, బిజయ్ సింగ్, మిథిలేష్ ఓజా పరారీలో ఉన్నారు. బాధితురాలిని చిత్తరంజన్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.