చాణక్యుడు చెప్పిన మాట.. ఈ అయిదు లక్షణాలు ఉన్న వ్యక్తులకు తిరుగు లేదు..
posted on Aug 16, 2023 9:30AM
ఒక వ్యక్తి జీవితం ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. వీటన్నిటినీ జాగ్రత్తగా డీల్ చేస్తూ జీవితంలో గొప్పగా ఎదగడం అనేది కత్తిసాము లాంటిది. గొప్ప పండితుడు, ఉపాధ్యాయుడు, నైపుణ్యం కలిగిన దౌత్యవేత్త ఆచార్య చాణక్యుడు. ఈయన తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అన్ని అంశాల గురించి ప్రస్తావించారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన విధానాలు నేటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ఆయన విధానాలు ప్రజలకు సరైన మార్గాన్ని చూపుతాయి. చాలా సార్లు మనం ఒక పని చేయడానికి మన సర్వ శక్తి సామర్థ్యాలు వినియోగిస్తాం. కానీ ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా అందులో విజయం సాధించలేకపోతున్నాం. ఆచార్య చాణక్య ప్రకారం, వైఫల్యం వెనుక వ్యక్తి స్వయం తప్పిదాలు ఉన్నాయి. ఆచార్య చాణక్యుడు తన నీతిలో ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పాడు, వాటిని అనుసరించడం ద్వారా వ్యక్తి తన వైఫల్యాన్ని సులభంగా మార్చుకోవచ్చు. తన ప్రయత్నాన్ని విజయంగా మార్చుకోవచ్చు. మనిషి ఒక ప్రయత్నంలో సక్సెస్ కావాలంటే ఈ అయిదు లక్షణాలు మనిషిలో ఉండాలి. అవేంటంటే..
ఆత్మ విశ్వాసం..
మనిషి జీవితంలో ఆత్మవిశ్వాసం అతి పెద్ద ఆస్తి. ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు ఏ పనిలోనూ విఫలం చెందరు. చాణక్యుడి ప్రకారం, ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తిని అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగిస్తుంది.
కష్టం..
కష్టపడి పనిచేసే వ్యక్తులు ఎప్పుడూ విఫలం కాలేరు. ఒక రోజు కాకపోయినా మరొక రోజు కష్టపడి పని చేసిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు, కాబట్టి కష్టం లేకుండా జీవితాన్ని ఎప్పుడూ మోసం చేసుకోకూడదు. కష్టపడి పనిచేయడమే విజయానికి ప్రధాన మంత్రం.
జ్ఞానం..
మనిషి జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించినా అది ఎప్పుడూ వృధా కాదు, అది పుస్తక జ్ఞానం అయినా లేదా ఏదైనా పని చేయడం ద్వారా పొందిన అనుభవ జ్ఞానం అయినా. ఏదో ఒక రోజు, ఈ అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తెలివైన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు.
డబ్బు..
జీవితంలో మంచి, చెడు అని రెండు సమయాలు, సందర్భాలు వస్తాయి, పోతాయి. చాలామంది డబ్బుకు మనిషి అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదు అని అంటారు. కానీ నేటి కాలంలో బ్రతకాలి అంటే డబ్బు ఎప్పుడూ అవసరం. అందుకే జీవితంలో విజయం సాధించడానికి మనిషి దగ్గర కూడా డబ్బు ఉండాలి.
అప్రమత్తత
జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించాలంటే అప్రమత్తత చాలా ముఖ్యం. ఎక్కడ నివసించినా, ఏ పని చేసినా, ఆ ప్రాంతాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. నిశ్శబ్దంగా ఉంటూనే విషయాలన్నీ వింటూ ఉండాలి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే వ్యక్తి వైఫల్యాన్ని పొందడం తక్కువ.
ఈ అయిదు లక్షణాలు ఉన్న వ్యక్తి ఏ పనిలో అయినా విజయం సాధించగలడు.
*నిశ్శబ్ద.