మద్యంలో ఐ ఎన్ ఎ కల్తీ మందుబాబులను మోసం చేస్తున్న వ్యాపారులు

మద్యంలో ఐ ఎన్ ఎ కల్తీ మందుబాబులను మోసం చేస్తున్న వ్యాపారులు ఎక్కువ కష్టపడకుండా కోట్లాది రూపాయలు అప్పనంగా దోచేయడానికి అలవాటుపడ్డ రాష్ట్రంలోని మద్యం వ్యాపారులకు ఎసిబి దాడుల కారణంగా కొంత ఇబ్బంది కలిగింది. దాడుల అనంతరం ఏమ్మార్పి రేట్లకే మద్యం విక్రయించాల్సి వస్తోంది. దీనివల్ల నష్టాలు రాకపోయినా లాభాలు తగ్గిపోయాయి. నిత్యం లక్షల్లో లాభాలు కల్లజూడాల్సిన మద్యం వ్యాపారులకు ఈ పరిణామం రుచించలేదు. దీంతో వారు మద్యం కల్తీకి గేట్లు తెరిచారు. రాష్ట్రవ్యాప్తంగా బ్రాండెడ్ మద్యానికి ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఇ ఎన్ ఎ) కలుపుతూ మళ్ళీ మామూలుగానే లక్షలాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. మద్యం సీళ్ళను తెలివిగా ఓపెన్ చేసి అందులోని కొంత మద్యాన్ని బయటకు తీసి ఆ మేరకు ఐ ఎన్ ఎ ని నిపుతున్నారు.

మద్యం తయారీకి సాధారణంగా ఐ ఎస్ ఎ వాడతారు. డిష్టలరీల నుంచి ఇ ఎన్ ఎ లను కొనుగోలుచేసి దానిని మరింత రిఫైండ్ చేసి బ్లెండెడ్ గా మార్చి మాధ్యమ తయారుచేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన మద్యం వ్యాపారులు డిష్టిలరీల నుంచి నేరుగా ఇ ఎన్ ఎ ను సేకరించి దాన్ని బాటిళ్ళలో కలుపుతున్నారు. దీనివల్ల మద్యం వ్యాపారులకు గతంలో ఏమ్మార్పి కన్నా ఎక్కువ రేటుకు అమ్మడం వల్ల వచ్చిన దానికన్నా ఇప్పుడు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. డిష్టిలరీల నుంచి మద్యం వ్యాపారులు ఇ ఎన్ ఎ ను లీటరుకు రూ, 40 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటి కల్తీ మద్యం తాగుతున్న మందుబాబుల ఆరోగ్యం క్షీణించడం ఖాయం. ఈ భాగోతమంతా ఎక్సైజ్ అధికారులకు తెలిసి నప్పటికీ దీనిని అరికట్టడానికి వారు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇంకో విషయం ఏమిటంటే ఈ కల్తీ మద్యం వ్యవహారాన్ని చూసీ చూడనట్లుగా వదిలేస్తున్న ఎక్సైజ్ సిబ్బందికి మద్యం వ్యాపారులు మళ్ళీ మామూలుగానే ముడుపులు అందిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu