జమిలీ బిల్లుకు సిద్దం
posted on Dec 17, 2024 1:54PM
జమిలి ఎన్నికల బిల్లు లోకసభలో ఆమోదం లభించింది. బిల్లు ప్రవేశ పెట్టడానికి 179 మంది ఆమోదం తెలిపారు. ఎన్డిఏ పక్షాలు ఆమోదం తెలపడంతో బిల్లు ప్రవేశపెట్టడానికి రంగం సిద్దమైంది. మెజారిటీ ఎంపీలు మద్దత్తు తెలిపారు. లోకసభలో బిజెపికి స్వంతంగా మెజార్టీ లేనప్పటికీ జమిలి బిల్లు పెట్టడానికి ఎన్ డిఏ సిద్దమైంది. ఒకే దేశం ఒకే ఎన్నిక కు పార్టీలకతీతంగా మద్దత్తు ఉంటుందని ఎన్డీఏ భావిస్తుంది. బిజెపి మేనిఫెస్టోలో జమిలి ఎన్నికలు ఉన్నాయి. లోకసభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలని ఇప్పటికే రామ్ నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. ఈ ఎన్నికలు జరిగిన వందరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రామ్ నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోకసభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లును కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు వ్యతిరేకించాయి. 361 మంది ఎంపీల మద్దతు ఉంటే లోకసభలో ఆమోదం పొందే చాన్స్ ఉంది.