జగన్ వర్గ ఎమ్మెల్యేలపై టిజి ధ్వజం
posted on Apr 26, 2011 8:57AM
కడప: మాజీ
పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యులపై చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ కడప జిల్లాలో తన ప్రచారంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ వర్గ ఎమ్మెల్యేలకు సిగ్గు ఏమాత్రమైనా ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారు తమ నైతికత చూపించాలనుకుంటే రాజీనామా చేసి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు విలువలు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలుసుకున్నారు కాబట్టే పార్టీలోకి అహ్వానించామని అన్నారు. కాంగ్రెసు పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయకుండానే ఇతర పార్టీలలో చేరడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికలలో గెలుస్తుందని చెప్పారు.