సోనియా కరుణతోనే జగన్ కోటీశ్వరుడు
posted on Apr 23, 2011 12:08PM
కడప:
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరుణా కటాక్షాలతోనే వైఎస్.జగన్మోహన్ రెడ్డి కోటీశ్వరుల జాబితాలో చోటు దక్కించుకున్నాడని కడప లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్రమంత్రి డీఎల్.రవీంద్రా రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని అటు పదవులు, ఇటు ప్రతిష్టలు పొందిన జగన్ కుటుంబం నేడు ఆ పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌లో 30 సంవత్సరాలు దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పలు పదవులు పొందారని గుర్తు చేశారు. అలాంటి వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి సోనియాగాంధీని ఇటలీతో పోలుస్తూ మాట్లాడాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్టు చెప్పారు. తండ్రి అధికారంలో ఉండగా కోట్లకు పడగలెత్తిన జగన్ ఇపుడు ఆ డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేసి తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న జగన్మోహన్‌రెడ్డి, విజయలక్ష్మిలు గత రెండు సంవత్సరాలు పదవిలో ఉండి ప్రజలకు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ కి పదవి కట్టబెడితే రాష్ట్రాన్ని దోచుకుంటాడన్నారు.