కోలుకుంటున్న సోనియాగాంధీ..

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి నాలుగు రోజుల క్రితం భుజానికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స జరిగింది. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్టు తెలుస్తోంది. నాలుగురోజులపాటూ ఐసీయూలోనే చికిత్స పొందిన ఆమెను శుక్రవారం ఐసీయూ నుంచి బయటికి తీసుకొచ్చారు.ఆవిడ పరిస్థితి చాలా మెరుగైనట్టు గంగారాం ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

 

కాగా వారణాసిలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న ఆమె ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. దానివల్ల భుజానికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. డీహైడ్రైషన్ సమస్యతో కూడా ఆమె బాధపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu