కమల్ వద్దు.. మహేషే ముద్దు!

 

గత ఏడాది విడుదలయిన హిందీ సినిమా ‘దబాంగ్’తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల భామ సోనాక్షి సిన్హాపై కమల్ హస్సన్ కూడా మనసు పారేసుకొన్నాడు. ఆమెతో ఆడిపాడి తన విశ్వరూపం చూపలనుకొన్న కమల్ హస్సన్ కి డేట్స్ లేవంటూ హ్యండిచ్చిన ఆ అందాల భామ మన ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో చాన్స్ అనగానే ఎగిరి గెంతేసినంత పని చేసి వెంటనే ఒప్పేసుకొంది. త్వరలో క్రిష్ దర్శకత్వంలోమహేష్ బాబు చేయనున్న సినిమాలో అతనితో ఆమె జత కట్టనుంది. అసలే మహేష్ బాబు..ఇప్పుడు అతనికి అందాల సోనక్షి జతయింది. ఇక ఆ జంట ఎంత చూడ ముచ్చటగా ఉంటుందో వర్ణించడం కష్టమే.

 

ఇక, శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోతున్న మరో సినిమాలో మరో బాలివుడ్ అందాల భామ సోనం కపూర్ కూడా జతకట్టదానికి సిద్దం అయింది. ఈ సినిమాకి కధనందిస్తున్న కోన వెంకట్ ఈ విషయాన్నీ దృవీకరించారు. సుకుమార్  దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని ఆయన అన్నారు. ఈ సినిమాకి ‘ఆగడు’ అని పేరు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇద్దరు హిందీ భామలతో రోమాన్స్ చేయబోతున్న మహేష్ బాబు ఇక అక్కడితోనే ఆగడని అనుకోవచ్చును. రెండు సినిమాలలో హిందీ భామలు ఉన్నందున ఆ రెంటినీ హిందీలో కూడా విడుదలచేస్తారేమో ఇంకా తెలియదు. మరిన్ని విశేషాలు త్వరలో.