ప్రభాస్ 'మిర్చి'తో ఫిబ్రవరి 8న వస్తున్నాడు
posted on Jan 27, 2013 1:41PM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "మిర్చి" ఒక రోజు ఆలస్యంగా రానుంది. ముందుగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని ఒక రోజు ఆలస్యంగా ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాని ప్రభాస్ కెరీర్ లో హయ్యేస్ట్ ధియేటర్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. "మిర్చి" లో ప్రభాస్ డిఫరెంట్ క్యారెక్టర్, న్యూలుక్ లో కనిపించనున్నారు.
ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సూపర్ హిట్ కొట్టింది. మాటల రచయిత కొరటాల శివ "మిర్చి"తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా యు.వి.క్రియేషన్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.