చిన్న నిర్లక్ష్యం భారీ మూల్యం!! 

ప్రపంచంలోని 57 దేశాలలో వ్యాపించిన ఓమైక్రాన్   చిన్న నిర్లక్ష్యం ప్రమాదకారిగా మారవచ్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే ప్రపంచం వ్యాప్తంగా వ్యాపించిన ఓమైక్రాన్  వేరియంట్ 5 7 దేశాలకు విస్తరించిందని డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది. అయితే  ఒమైక్రాన్  డెల్టా వేరియంట్  కంటే తక్కువ ప్రబావం కలిగిఉందని గుర్తించినట్లు  డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది. చాలా దేశాలకు విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకుల  వల్లే వ్యాప్తి చెందిందన్న విషయాన్నిస్పష్టం చేసింది.  డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్  టేడ్రోల్  అద్నం  గేబ్రియల్  మాట్లాడుతూ  ఒమైక్రాన్ వ్యాప్తి ఉందన్న విషయం స్పష్ట మైంది అని అన్నారు. ఒమైక్రాన్ విస్తరణ నివారణకు దేశాలు  సమగ్ర చర్యలు చేపట్టడం ద్వారా  ఆసుపత్రుల లో చేరుతున్న వారి సంఖ్యను తగ్గించవచ్చని అభిప్రాయ పడ్డారు. అన్ని దేశాలు  దీనిపై దృష్టి పెట్టాలని గేబ్రియల్ సూచించారు. టెస్టింగ్ ట్రేసింగ్  పరీక్షలు  సీక్వెన్సింగ్ పెంచాల్సిన అవసరం ఉందని  గే బ్రియల్ స్పష్టం చేసారు. కాగా ఒక చిన్న నిర్లక్ష్యం  కొంచం కాదు భారీ మూల్యం చెల్లించక తప్పదని  ఆయన హెచ్చరించారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ  వారాంతపు సమీక్షలో భాగం గా సమర్పించిన రెపొర్ట్ లో  ఒమైక్రాన్ వేరియంట్  ప్రభావం  గానంకాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరముందని అన్నారు.కాగా ఆరోగ్యశాఖ సంస్థలు మాత్రం డెల్టా వేరియంట్ ప్రభావం కన్నాఒమైక్రాన్ తీవ్రత  తక్కువగా ఉంటుందని ఆసుపత్రులలో  రోగుల సంఖ్య  పెరగవచ్చని  ఎందుకంటే  త్వరిత గతిన  వ్యాప్తి చెందడం ఆందోళన కారమని ముందు జాగ్రతగా  చర్యలు చేపట్టడం ద్వారా  ఒమైక్రాన్ తీవ్రతను  తగ్గించేందుకు ప్రయాత్నం లో భాగం గా చర్యలు పూర్తిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది.