న్యుమోనియా కారణాలు చికిత్స ...

ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ సోకి వాచిపోయి నొప్పిని కలగ చేయడమే న్యుమోనియా అని అంటారు. న్యుమోనియా వల్ల  ఇంగ్లండ్ లో 27,౦౦౦ మంది చనిపోతున్నారని ఒక అధికారిక అంచనా.సాధారణంగా శరీరంలో మరేదో సీరియస్ జబ్బుకు కాంప్లికేషన్ గా నిమోనియా వస్తుంది.బ్యాక్టీరియా,వైరస్ లు,ఫంగి,వంటి విష పదార్ధాలు ఊపిరి తిత్తుల్లో కి ప్రవేశించి వాటికీ ఇన్ఫెక్ట్ అయినప్పుడు అవి వాచీ ఆవ్యక్తిలో న్యుమోనియా ఏర్పడుతుంది.న్యుమోనియలో రెండు రకాలు ఉన్నాయి.

1.లోబార్ న్యుమోనియా

 2. బ్రాంకో న్యుమోనియా 

బ్రాంకో న్యుమోనియా లో లోబార్ న్యుమోనియా లో ప్రారంభ దశలో ఊపిరి తిత్తికి సంబంధించి న ఏదైనా ఒక లోబ్ ఇన్ఫెక్ట్ అవుతుంది.అభివృద్ధి చెందిన దేశాలలోఇది చ్సలా అరుదు.బ్రంకో న్యుమోనియాలో బ్రాంచి లో గాని వాపు ప్రారంభమై తర్వాత అది ఊపిరి తిత్తులోకి కాన సముదాయానికి వ్యాపిస్తుంది.
న్యుమోనియా ఎంతకాలం ఉంటుంది? బ్యాక్టీరియా మూలంగా వచ్చే న్యుమోనియా ను సరైన యాంటిబయాటిక్ మందులతో ట్రీట్ చేస్తే వరం పదిరోజులలో తగ్గిపోతుంది. అయితే వైరస్ వాళ్ళ వచ్చ్చే న్యుమోనియా అంతసీరియస్ కాదు.,మందులు అంతగా పనిచేయవు. వారం రోజులలో దానికి అదే తగ్గిపోతుంది. ఈ రెండు రకాల న్యుమోనియా లో పూర్తిగా స్వస్థత పొందడానికి రెండు మూడు వరాల సమయం పడుతుంది. 

న్యుమోనియా కారణాలు...

న్యుమోకోకస్ ,స్టెపిలోకోకస్వంటి బ్యాక్టీరియా మూలంగా వస్తుంది. వైరస్ ల మూలంగా వచ్చే న్యుమోనియా కి చికెన్ పొక్ష్ వైరస్ లు 

న్యుమోనియా లక్షణాలు ...

న్యుమోనియా లో విడవకుండా పొడి దగ్గు. తీవ్రమైన జ్వరం,ఎగ శ్వాస,దిగ శ్వాస వస్తుంది. చాతిలో నెప్పి ఒకసారి చాతికి ఒక వైపునేనొప్పి ఉంది శ్వాస పీలుస్తున్నప్పుడు,దగ్గు తున్నప్పుడు ఎక్కువ అవుతుంది. జ్వరం చలి,పొడి దగ్గు కఫం ఉండదు కానీ ఏ కొద్దిగా ఉన్నా తెమడ వస్తే అందులో ఎర్రగా రక్తపు చరాలు కనిపిస్థాయి. శ్వాస ఇబ్బందిగా ఉంటుంది.నీరసం,అలసట, తలనొప్పి,తేమలటం వాంతులు,చిన్న పిల్లలో వ్యాధి లక్షణాలు అంతగా కనిపించవు,దగ్గు కొద్దిగా ఉండచ్చు.అసలు ఉండకనూ పోవచ్చు.బాగా జ్వరం డొక్కలు లోపలి పోతూ ఎగశ్వాస,దిగ శ్వాస ఉంటె మాత్రం పిల్లలో న్యుమోనియా తీవ్రంగా ఉన్నది అనడానికి సూచనగా చెప్పవచ్చు. 

న్యుమోనియా ఎవరికీ వస్తుంది...

వృద్ధులకు,వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి న్యుమోనియా రావచ్చు. వేరే ఇతారత్ర కారణాల వాళ్ళ ఆసుపత్రిలో చేరిన వారికి న్యుమోనియా వస్తుంది. సిగరెట్టూ తాగే వాళ్ళకి, మద్యం సేవించే వాళ్ళకి,పోషకాహారం లోపం ఉన్నవారికి,వైరల్ ఇన్ఫెక్షన్తో బాధ పడే వారికి, క్రానిక్ బ్రాంకైటిస్ లేదా ఎంఫి సేమా,రాకత హీనత ఉన్న వారికి,రేడియో తెరఫీ, కీమో తెరఫీ తీసుకుంటున్న క్యాన్సర్ రోగులకు దీనివల్ల రోగులలో రోగనిరోదక  వ్యవస్థ బలహీన పరుస్తాయి.ఎయిడ్స్ తో బాధ పడే వారికి అన్నిరకాల వ్యవస్థలకు న్యుమోనియా సోకే అవకాసం ఉంది. 

న్యుమోనియాను ఎలా నిర్ధారిస్తారు...

ఛాతీ,ఎక్సరే కఫం విశ్లేషణ రక్త పరీక్ష ద్వారా న్యుమోనియా బ్యాక్తీరియా కు సంబందించినద కాదా లేక వేరే బ్యాక్టీరియా అన్న విషయంలో డాక్టర్లు ఒక నిర్ధారణకు వచ్చి అందుకు అనుగుణంగా మందులను రాసి ఇస్తారు. 

న్యుమోనియా చికిత్స...

సరిపడా బెడ్ రెస్ట్ తీసుకోవాలి.ఆవిరిని పీల్చడం  పుష్కలంగా ఫ్లుఇడ్స్ తీసుకోవాలి.జ్వరం ఇతర సంబందిత సమస్యలకు డాక్టర్ను సంప్రదించాలి.టాబ్లెట్లను ఇవాలి బ్యాక్టీరియా మూలంగా వచ్చిన న్యుమోనియా అయితే డాక్టర్ రాసిన యాన్తి బాయితిక్స్ ని రాసి ఇస్తారు. ముక్కు దిబ్బడ వేస్తే ముక్కులో డ్రాప్స్ స్ప్రే కాంతివి డాక్టర్ సూచన మేరకు వాడాలి.కఫం లేని దగ్గు ఉంటె  దగ్గు మందులు.కఫం తో కూడుకున్న దగ్గుకు మరో మందును డాక్టర్ సూచన మేరకు వాడాలి 

 న్యుమోనియా ప్రమాదమా...

న్యుమోనియా వ్యాధి గ్రస్తులు సహజంగా రెండు వారాలలో కోలు కుంటారు.వృద్ధులు కాస్త బలహీనంగా  ఉన్నవారు ఊపిరి తిత్తుల కణ జాలం చికిత్సకు లొంగక పోతే క్రమేపీ తగకుంటే ఊపిరి తిత్తులు దెబ్బ తిని రేస్పిరేటరీ ఫైల్యూర్ తో చనిపోయే అవకాశాలు ఉన్నాయి.