క్రాక్ చెయ్యాలంటే కొన్ని తెలియాలి!

గ్రాండ్స్ గోల్స్ అంటే చాలామంది మనసులో ఐ.ఏ.యస్, ఐ.పి.యస్ వంటి ఉద్యోగాల పేర్లు ఉండిపోతాయి. నిజానికి అవి ఎంతో ఉన్నతమైన ఉద్యోగాలు కూడా. ప్రభుత్వం స్వయంగా ఎంపిక చేసే ఈ వర్గాలలో ఉద్యోగం సంపాదించడం చాలామంది కల. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆ కలను నెరవేర్చుకోవాలని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు కూడా. అయితే సాధారణ గ్రామీణ ప్రాంతాల వ్యక్తులు కూడా ఈ వైపు సక్సెస్ అవ్వాలంటే అందరూ తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. 

సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించేవాళ్లకు డిగ్రీ అయిపోయాక ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరడం తప్పనిసరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కారణంగా అలా చేస్తారు.  ఓ  మధ్యతరగతి వ్యక్తికి ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవ్వడం సరైనదేనా అనే విషయం ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు ముక్కుసూటిగా మాట్లాడుకోవాలి.

ఇప్పుడే మొదలు పెట్టినట్లైతే..

మొదలు పెట్టిన పని పూర్తి చేయడం  అనేది వయసు మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇంటర్, డిగ్రీ, ఎం.ఏ, ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వాళ్లకు అటు ఇటుగా సుమారు పాతిక సంవత్సరాల వయసు ఉండే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ వైపు ఆలోచనలు కూడా దాదాపుగా 22-25 సంవత్సరాల వయసు వారికే ఎక్కువ ఉంటుంది కూడా. చాలామంది ప్రాక్టీకల్ గా ఆలోచించలేక నోటి లెక్కలు వేసుకుని పాతిక సంవత్సరాల వయసులో నిర్ణయం తీసుకుని ర్యాంకులు కొడతాము అనుకుంటారు. అయితే అక్కడే ఒక తప్పు జరిగిపోతుంది. 

చాలా మంది జాబ్ కొట్టిన వాళ్ళు, ఐ.ఏ.యస్, ఐ.పి.యస్ క్లియర్ చేసినవాళ్ళు వల్ల ఫ్యామిలీ ఇంకా స్నేహితులు మీడియా ముందు ఎన్నెన్నో చెబుతూ ఉంటారు. వాటిలో చాలామంది జాబ్ చేసుకుంటూ రాత్రి పగలు కష్టపడి చదివేసి, నిజాయితీగా ఉంటూ ప్రిపేర్ అయినట్టు చెబుతారు. అయితే వాటిలో నిజం చాలా తక్కువగా ఉంటుంది.ఆ మాటలు అన్నీ బాగా షేక్ చేసిన కూల్ డ్రింక్ బాటల్ ఓపెన్ చేయగానే ఎలాగైనా బుస్సు మని పొంగుతుందో అలాంటివే. సినిమాటిక్ గా జరిగే వాటికి రియాలిటికి ఉన్న తేడాను అందరూ అర్థం చేసుకోవాలి. 

ఐ.ఏ.యస్, ఐ.పి.యస్  పరీక్షలు నెగ్గాలంటే కొన్ని లక్షణాలుండాలి. అవి కొన్ని పుట్టుకతోనూ ఉంటయి, మరికొన్ని  పెంపకం తో వస్తాయి.కొన్ని ఏం చేసినా రావు.

ఓ స్థిర నిర్ణయం!!

ఏ పని అయినా సరే చేయాలా వద్దా అనేదానికోసం ఒక స్థిరనిర్ణయం ముఖ్యం. అలాగే దేనికి ఇంపోర్టెన్స్ ఇవ్వాలనే విషయం కూడా ముఖ్యమే. ఇద్దరు వ్యక్తులు సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. వాళ్లలో ఒకడికిజాబ్ కొట్టాలి అంటే దేశభక్తి ఎక్కువ ఉండాలి, సమాజాసేవ బాగా చేసే గుణం ఉండాలి అనుకుని చదువుకుంటూ సమాజాసేవ కార్యక్రమాలకు అటెండ్ అవుతాడు, ఇంకొకడు అన్ని వదిలేసి సివిల్స్ కు చదువుతూ ఉంటాడు. ఉన్న సమయంలో తాను చేరాలనుకున్నా లక్ష్యం గురించి ఆలోచించేవాడే దాన్ని చేరగలడు. అందుకే కేవలం బాగా చదువుకున్న వాడే ఆ లక్ష్యాన్ని చేరగలిగాడు. ప్రిపేరేషన్ మీద ఒక స్థిరనిర్ణయంతో ఉండాలి.

కష్టం!!

కష్టం అందరూ చేస్తారు కానీ పది లక్షలమంది పోటీదారులు నుండి కేవలం 180 మాత్రమే ఎంపిక అవుతారు. మరి మిగిలిన వాళ్ళు చదవలేదనా?? కానీ కాదు కాబట్టి  కష్టం చేసినంత మాత్రాన ఫలితం దక్కాలనే రూల్ లేదు. దాదాపు పది సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి, ఆరు అట్టెంప్ట్ ల తర్వాత ఒక్క మార్కుతో క్లియర్ కాని వాళ్ళెందరో ఉన్నారు.

పర్ఫెక్ట్ మార్గం!!

కొందరికి కుటుంబం లో, కాలేజీ లో గైడెన్స్ దొరుకుతుంది. లేకపోతే కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా ఉండనే ఉన్నాయి. ఇంకా ఇప్పటి టెక్నాలజీ వల్ల ఆన్లైన్ లో చూసి నేర్చుకోవచ్చు. కానీ కోచింగ్ తీసుకునేవాళ్లకు సమయం కలిసొస్తుంది. అంటే ఇక్క టైమ్ మేనేజ్మెంట్ ఎంతో ముఖ్యం. కోచింగ్ వల్ల అందరికీ లభించేది అదే. అలాగే పర్ఫెక్ట్ గా ఏమి చదవాలి అనే విషయం గురించి క్లారిటీ ఉండాలి కూడా. అవగాహన లేకుండా అనవసరమైన విషయాలు చదువుతూ ఉంటే ఎప్పటికీ చదవాల్సిన విషయాలను సగం కూడా క్లియర్ చెయ్యలేరు. 

ఆప్షన్స్!!

సాదారణంగా ఇలాంటి పెద్ద పెద్ద లక్ష్యాలకు ఎలాంటి ఇతర ఒత్తిడి ఉండకూడదు. అది ఇంటి పని కావచ్చు, ఇతర ఉద్యోగం కావచ్చు, బాధ్యతలు కావచ్చు, ఇతర చదువులు కావచ్చు. ఇవన్నీ చేస్తూ ప్రిపేరేషన్ అంటే నెలలు, సంవత్సరాల కొద్దీ అయ్యేదేనా అనే విషయం కొంచెం ఆలోచించుకోవాలి. సంవత్సరాల కొద్దీ చదివినా తరగని  నిదిలా ఉండే ఆ సిలబస్ లను కవర్ చేయాలంటే పూర్తి సమయాన్ని దానికి ఇచ్చేయ్యాలి. 

వేగంగా రాసినా అందంగా ఉండే దస్తూరి, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, అదృష్టం.. ఇవి ఒకదానికి ఒకటి లింక్ అయి జటాయి. 

ప్రశాంతంగా ఉండాలంటే ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వంటివి ఉండకూడదు. ప్రిపేరేషన్ మొదలు పెడితే, ప్రేపరషన్ కి1.5 సంవత్సరం, పరీక్షకి 1 సంవత్సరం. ఒక అట్టెంప్ట్ కి రెండున్నర సంవత్సరాలు పెట్టాలి. వీటన్నింటినీ లెక్కేసుకుంటే సగటు మధ్యతరగతి వ్యక్తికి 5 సంవత్సరాలు ఇక్కడ అయిపోతాయి. అంటే 25 నుండి 30 కి జంప్ అవుతారు. సీరియస్ గా చేసే అటెంప్ట్ లో మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటూ బాధ్యతగా ఉంటూ మానసిక ఒత్తిడి భరిస్తూ చదవడం కుదిరేపనేనా??

 22 కల్లా ఐఏఎస్ అయినవాడు 16 ఏట నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తాడు. బయటికి చెప్పరు అంతే.  ఒకసారి హైదరాబాద్ లో ఐ.ఏ.యస్ కోచింగ్ అకాడమీకి వెళ్తే అక్కడ కోచింగ్ తీసుకుంటున్న అవల్లలో ఇంటర్ పిల్లకాయలు కూడా కనబడి ఆశ్చర్యపోయేట్టు చేస్తారు. అంటే ఇదంతా డిగ్రీ అయిపోయాకనో, ఎం.ఏ అయిపోయాకనో మొదలుపెట్టే పని కానే కాదు. 

ఉద్యోగం చేస్తూ క్లియర్ చేసినవాళ్లకు ఒక ఆప్షన్ ఉంటుంది. క్లియర్ కాకపోయినా ఒక జాబ్ అంటూ ఉంది కదా అనే నిశ్చింత. అది లేకుంటే ఒకసారి అటెంప్ట్ కు టోటల్ గా 5 సంవత్సరాలు నష్టపోయి వేరే ఉద్యోగాల విషయంలో కూడా వెనుకబడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు.

సో పెద్ద లక్ష్యాలు చేరాలంటే చాలా తొందరగా వాటి కోసం కసరత్తు చేయాలి. అలాగని ఇప్పుడు ఆశ వదిలేసుకోమని కాదు. ఏమో అదృష్టమనే ఆప్షన్ కూడా ఉంటుంది.

                               ◆వెంకటేష్ పువ్వాడ.