నేడు షర్మిల కొడుకు రిసెప్షన్... మరి మేనమామ వైఎస్ జగన్ వెళ్తాడా

మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు లేదా అనేది ముద్దుల మావయ్య సినిమాలోని మాస్ సాంగ్. తెలుగు రాష్ట్రాల్లోని ఈ పాట లిరిక్స్ ఎవరూ మర్చిపోలేరు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జీవం పోసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారాల పట్టి వైఎస్ షర్మిల ఇంట్లో  పెళ్లివేడుకలు జరుగుతున్నాయి ఈ వేడుకలకు  స్వంత అన్న డుమ్మా కొట్టడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. షర్మిల కొడుకు రాజారెడ్డి రిసెప్షన్ వేడుక నేడు (ఫిబ్రవరి 24) జరగనుంది. రిసెప్షన్ వేడుక పెళ్లి వేడుకల్లో చివరిది.  ఈ వేడుకకు జగన్ హాజరవుతారా   అనేది పీసీసీ అధ్యక్షురాలి అయిన వైఎస్ షర్మిల ఇంట్లో  ప్రశ్నగా మిగిలిపోయింది.  
వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి రిసెప్షన్‌ శనివారం జరగనుంది. హైదరాబాద్‌ శంషాబాద్‌లోని ఫోర్ట్‌ గ్రాండ్‌ హోటల్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దేశంలోని నలుమూలలనుంచి రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు హాజరవుతున్నారు. షర్మిల స్వంత అన్న జగన్ ఈ వేడుకకు హాజరవుతారా అనేది శేష ప్రశ్నగా మిగిలిపోయింది. షర్మిల కొడుకు రాజారెడ్డికి మేనమామ  వైఎస్ జగన్. స్వయంగా మేనమామ హాజరై అన్ని బాధ్యతలు నెరవేర్చాలి. మేనమామ హాదాలో రావాలని రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో ఫిబ్రవరి 17వ తేదీన జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్‌ఫూర్‌ ప్యాలెస్‌లో కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 18వ తేదీన క్రిస్టియన్‌ సంప్రదాయ పద్ధతిలో వీరి పెండ్లి జరిగింది.
పెళ్లికి అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన జగన్ ఈ రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అమ్మగా లాలించి నాన్నలా పాలించాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. తండ్రి చనిపోయిన తర్వాత   షర్మిల బాగోగులు అన్న చూసుకోవాలి. కానీ జగన్ ఆ బాధ్యతను తీసుకోలేదు.  తన  అన్న గెలుపుకోసం గత ఎన్నికల్లో ఆమె చేసిన పాదయాత్రను రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేరు. అధికారంలో రాగానే జగన్ తల్లిని, చెల్లిని తన రాష్ట్ర నుంచే తరిమేసారు. ఎపిలో ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నాయి. రెండో సారి మళ్లీ అధికారంలో వచ్చి అరాచక పాలన చేయాలని జగన్  చేస్తున్న వ్యూహాన్ని పిసిసి అధ్యక్షురాలి హోదాలో  షర్మిల నిలువరించబోతున్నారు. ఎపిలో ప్రజా రంజక పాలన పోయి ప్రజా కంటక పాలనను అడ్డుకోవాలని ఆమె పోరాడుతోంది.   షర్మిల కొడుకు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ రీతిలో జరిగినప్పుడు స్వంత మేన మామ అయిన జగన్ డుమ్మా కొట్టాడు. ఆత్మీయత కన్నా జగన్ కు  అధికారమే  గొప్పది.  కాబట్టి ఈ రిసెప్షన్ వేడుకకు కూడా డుమ్మా కొడతాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.