94 మందితో టిడిపి -జనసేన  అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది. శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. వాస్తవానికి టీడీపీ, జనసేనలతో బీజేపీ కూడా కూటమిలో కలిసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ అధిష్టానం నుంచి పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది.. అందుకే టీడీపీ, జనసేనలు తొలి జాబితా విడుదల చేశారు. జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలకు ముగింపు పలకడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు అన్నారు. 

ప్రయోగాల జోలికి వెళ్లకుండా, తక్కువ సీట్లైనా పర్వేలేదనే, అన్నీ ఆలోచించే తాము ముందడుగు వేశామని చంద్రబాబు  చెప్పారు. నాయకులంతా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని పవన్ సూచించారు. టీడీపీ ఓటు జనసేనకు ఎంత ముఖ్యమో, జనసేన ఓటు టీడీపీకి అంతే ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదని అన్నారు. జనసేన - టీడీపీ కూటమికి బీజేపీ మద్దతు ఉందని తెలిపారు.
తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

టీడీపీ అభ్యర్థులు
ఆముదాలవసల - కూన రవికుమార్
ఇచ్చాపురం - బెందాళం అశోక్
టెక్కలి - అచ్చెన్నాయుడు
రాజాం - కొండ్రు మురళీమోహన్
అరకు - దొన్ను దొర
కురుపాం - జగదీశ్వరి
పార్వతీపురం - విజయ్ బొనెల
సాలూరు - గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి - బేబీ నాయన
గజపతి నగరం - కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం - పూసపాటి అదితి
నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు
పాయకరావుపేట - వంగలపూడి అనిత
విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖ వెస్ట్ - గణబాబు
ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు
పి గన్నవరం - మహాసేన రాజేష్
కొత్తపేట - బండారు సత్యానందరావు
మండపేట - జోగేశ్వరరావు
రాజమండ్రి - ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం - చినరాజప్ప
తుని - యనమల దివ్య
అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
ఆచంట - పితాని సత్యనారాయణ
పాలకొల్లు - నిమ్మల రామానాయుడు
ఉండి - మంతెన రామరాజు
తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ
చింతలపూడి - సొంగా రోషన్ కుమార్
తిరువూరు - కొలికపూడి శ్రీనివాసరావు
నూజివీడు - కొలుసు పార్థసారథి
ఏలూరు - బడేటి రాధాకృష్ణ
గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ - వెనిగండ్ల రాము
పెడన - కాగిత కృష్ణ ప్రసాద్
మచిలీపట్నం - కొల్లు రవీంద్ర
పామర్రు - కుమార్ రాజా
విజయవాడ సెంట్రల్ - బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ ఈస్ట్ - గద్దే రామ్మోహన్
జగ్గయ్య పేట - శ్రీరామ్ తాతయ్య
నూజివీడు - కొలుసు పార్థసారథి
నందిగామ - తంగిరాల సౌమ్య
తాడికొండ - తెనాలి శ్రావణ్ కుమార్
మంగళగిరి - నారా లోకేష్
పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ కుమార్
బాపట్ల - నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు - బూర్ల రామాంజనేయులు
చిలకలూరి పేట - ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి - కన్నా లక్ష్మీనారాయణ
పర్చూరు - ఏలూరి సాంబశివరావు
రేపల్లె - అనగాని సత్యప్రసాద్
వేమూరు - నక్కా ఆనందబాబు
కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహరెడ్డి
కొండెపి - డోలా బాలవీరాంజనేయులు
ఒంగోలు - దామచర్ల జనార్థన్
ఎర్రగొండపాలెం - ఎరిక్సన్ బాబు
మార్కాపురం - కందుల నారాయణరెడ్డి
నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

జనసేన అభ్యర్థులు 
కాకినాడ రూరల్ : నానాజీ 
నెలిమర్ల: లోకం మాధవి 
తెనాలి : నాదెళ్ల మనోహర్ 
అనకాపల్లి : కొణతాల రామకృష్ణ 
రాజనగరం: రామకృష్ణుడు