తెలంగాణకు పెరుగుతున్న మద్దతు మరో సీఎం ఓటు

న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మరొకరు మద్దతు పలికారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాను అనుకూలంగా ఉన్నానని చెప్పారు. విదర్భ కూడా ఏర్పడాల్సిందేనని ఆయన సూచించారు. కాగా ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్రాల విభజనకు అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు.