ఈసారి తెలంగాణపై బొత్స రియాక్షన్ ఏంటి?
posted on Nov 21, 2011 11:39AM
హైదరా
బాద్: పిసిసి చీఫ్ అయ్యాక ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని తెలంగాణ జిల్లాల్లో పర్యటించారు.అయితే అప్పుడే ఆయనకు తెలంగాణ సెగ తగిలింది.దానికి ఆయన కాంగ్రెసు పార్టీ తెలంగాణ సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని, త్వరలో పరిష్కారమవుతుందని చెప్పుకొచ్చారు. ఆయనను తెలంగాణ అంశంపై ఎప్పుడు అడిగినా ఆదే మాట పల్లె వేసేవారు. అయితే ఇటీవల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తాము ఇప్పట్లో తెలంగాణ తేల్చలేమని ప్రకటించారు. దీంతో ఆయన ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో బొత్స పర్యటిస్తే ఏం చెప్పి సర్ది చెబుతారనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇప్పటి వరకు బొత్స సీమాంధ్ర ప్రాంతంలో విస్తృత పర్యటనలు జరిపారు. త్వరలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తృత పర్యటనలు జరపనున్నారు. ప్రజలు ఆయనని తెలంగాణపై నిలదీసే అవకాశాలున్నాయి. ప్రధాని ప్రభుత్వ నేత అయినప్పటికీ ఆయన కాంగ్రెసు పార్టీ వ్యక్తి కాబట్టి పార్టీ నుండి ప్రకటన రాలేదని బొత్స చెప్పినా ప్రజలు నమ్మె పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకు త్వరలో తెలంగాణ తేలుతుందని ప్రజలకు చెప్పిన బొత్స తన తెలంగాణ పర్యటనలో ఈసారి ప్రజలకు ఏం చెబుతారో?