రాజగోపాల్కు 25 వరకూ రిమాండ్

హైదరాబాద్ :  ఓఎంసీ కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్కు నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 25 వరకూ రిమాండ్ విధించింది. ఆయన్ని చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. నేటితో రాజగోపాల్ కస్టడీ ముగియటంతో సీబీఐ అధికారులు సోమవారం ఉదయం ఆయన్ని కోర్టులో హాజరు పరిచారు.వాదనల అనంతరం కోర్టు ఆయన రిమాండ్ పొడిగించింది.

కాగా రాజగోపాల్‌ను మరో వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గాలి గనుల కేసులోని పూర్తి వివరాలు సేకరించడానికి ఆయన కస్టడీ కావాలని అధికారులు కోర్టుకు విన్నవించుకున్నారు.