సెల్ఫీ తీసుకున్నాడు.. హంతకుడు దొరికిపోయాడు..

 

సెల్ఫీ తీసుకుంటూ ఎంతో మంది ప్రాణాలు పోయినవాళ్లను చూసుంటాం. కానీ చెన్నైలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకోని దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అడ్డంగా బుక్కాయ్యాడు ఓ హంతకుడు. వివరాల ప్రకారం.. చెన్నై వాసి అయినా మణి అనే వ్యక్తి.. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తాను  2009లో తాను తన సొంతు ఊరు అయినా అరియ‌ళూరుకి వచ్చాడు. ఒకరోజు తన భార్య అయిన విజయలక్ష్మీతో గొడవ పడిన మణి ఆమెపై కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. ఇక అప్పటినుండి పోలీసులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. కానీ లాభం లేకపోయింది.

 

అయితే ఈ మధ్య ఆ హంతకుడు తన స్నేహితులతో తీసుకున్న ఫొటో ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీన్ని గమనించిన విజయలక్ష్మీ బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. త‌న భార్య‌ను హ‌త్య‌చేసిన త‌రువాత నాలుగేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిపాడ‌ని, త‌రువాత మ‌ళ్లీ చెన్నైకి వెళ్లి అక్క‌డి ఓ హోట‌ల్‌లో ఉద్యోగం చేశాడ‌ని పోలీసులు మీడియాకి తెలిపారు.