విశేషంగా ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్, మోడీ విగ్రహాలు
posted on May 2, 2025 4:13PM

అమరావతి పనుల పున: ప్రారంభ వేళ తెనాలిలోని సూర్య శిల్పశాల నిర్వాహకులు రూపొందించిన వివిధ విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ శిల్పాలను అమరావతి సభావేదిక ఎడమ వైపున ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణం, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక ప్రాముఖ్యతలను తెలియజేయడానికి రూపిందించారు.
అమరావతి సభావేదికకు ఎడమవైపు ఏర్పాటు చేసిన శిల్పాలలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ప్రధాని నరేంద్రమోడీ, బుద్ధుడి విగ్రహం, మేక్ ఇన్ ఇండియా సింహం, అమరావతి అక్షర రూపం, సైకిల్, కమలం విగ్రహాలు, ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్. జాతీయ రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసిన మహాను భావుడు. ఆయన విగ్రహం రాష్ట్ర ప్రజలకు ఆయన సేవలను గుర్తు చేస్తూ, ప్రస్తుత పాలక పక్షమైన తెలుగు దేశం పార్టీకి చెందిన చారిత్రక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తుంది. ఇక ప్రధాని మోడీ విగ్రహం అమరావతి పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం మద్దతును చిహ్నంగా నిలుస్తుంది. అలాగే బుద్దుడి విగ్రహం అమరావతి చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి గుర్తుగా నిలుస్తుంది. తయారీ రంగాన్ని ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా ను స్ఫురింప చేస్తూ అమరావతిని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేకిన్ ఇండియా సింహం విగ్రహం నిలుస్తుంది.