భవనం కూలి 10 మంది మృతి

 

నిర్మాణంలో వున్న ఓ భవనం కూలిపోయి 10 మంది మరణించిన ఘటన సౌదీ అరేబియాలో జరిగింది. ఈ ఘటనలో పాకిస్థాన్‌కి చెందిన తొమ్మిదిమంది కూలీలు, ఇండియాకి చెందిన ఒక కూలీ మరణించారు. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన మరో పదిమంది కూలీలను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. భవనం మీదకు కాంక్రీట్‌ని తరలిస్తూండగా ఈ ప్రమాదం జరిగింది.