బాబా సమాధిపై నిర్ణయించలేదు: సత్యసాయి ట్రస్టు

అనంతపురం: గత రెండు రోజులుగా యజుర్వేద మందిరాన్ని తెరుస్తారనే కథనాలు వెలువడిన నేపథ్యంలో మంగళవారం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో ఆ మందిరాన్ని ఎప్పుడు తెరుస్తారో నిర్ణయం తీసుకోవాడానికే సభ్యులు భేటీ అయ్యారని భావించారు. భేటీ అనంతరం సాయి ట్రస్టు సభ్యులు మీడియాతో మాట్లాడారు. తాము యజర్వేద మందిరం తెరవడంపై భేటీలో చర్చించలేదని చెప్పారు. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం అయిన సత్యసాయిబాబా మహాసమాధి నిర్మాణంపై చర్చించినట్లు వారు స్పష్టం చేశారు. సమాధి నిర్మాణంతో పాటు సిబ్బంది వేతనంపై కూడా చర్చించినట్లు చెప్పారు. భేటీ అనంతరం సభ్యులు మందిరంపై చర్చించలేదని చెప్పడంతో మళ్లీ దానిపై ఉత్కంఠ ఏర్పడింది. బాబా సమాధి నిర్మాణానికి కొన్ని నమూనాలు పరిశీలించామని, రెండు రోజుల్లో ఒక నమూనా ఎంపిక చేస్తామని ట్రస్టు సభ్యులు తెలిపారు. సత్యసాయి ట్రస్టుకు సంబంధించి లక్షల కోట్ల రూపాయలు అందులోనే ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సమావేశానికి జస్టిస్ భగవతి, హిందూలాల్ షా హాజరు కాలేదు. దీంతో మరోసారి సభ్యులు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu