వైయస్ఆర్ కాంగ్రెసు కీలక భేటీ
posted on May 31, 2011 12:15PM
హైదరా
బాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ సెంట్రల్ గవర్నెన్స్ సమావేశం సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలిశారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ మొదటిసారి అధికారికంగా భేటీ అయింది. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు తదితరాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ ముసాయిదా తయారు చేసే సోమయాజులు కూడా పాల్గొన్నారు. ఆయన 1994 నుండి 2004 వరకు కాంగ్రెసు పార్టీకి పని చేశారు. సమావేశానికి ముందు ఆయన మాట్లాడుతూ పథకాలు కాంగ్రెసు పార్టీవి కావని కేవలం వైయస్ రాజశేఖరరెడ్డివే అన్నారు. కాంగ్రెసు పార్టీ పథకాలు అయితే జాతీయస్థాయిలో కాంగ్రెసు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు ప్రవేశ పెట్టలేదన్నారు. జగన్ వెంట వెళుతున్న కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వచ్చారు.