మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువే: బాలినేని
posted on May 31, 2011 12:50PM
హైదరాబాద్: వైయస్సార్ కాం
గ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న శాసనసభ్యుల బలం మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువేనని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. జగన్ వెంట ఉన్న ఎమ్మెల్యే సంఖ్య మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక్కటి ఎక్కువే ఉంటుందని ఆయన అన్నారు. జగన్‌ను కలవడానికి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తమ తడాఖా చూపిస్తామని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు పెట్టాలని, అవిశ్వాసం పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో చంద్రబాబు చూడాలని ఆయన అన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే చంద్రబాబు రాజకీయంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రమంతటా కడప ఉప ఎన్నికల ఫలితాలే వస్తాయని జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.