సత్యసాయి బాబా జిల్లాగా అనంతపురం జిల్లా?
posted on Apr 25, 2011 9:26AM
హైదరాబాద్: ప్ర
పంచ ప్రఖ్యాతిగాంచిన పుట్టపర్తి సత్యసాయి బాబా సేవలకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా అనంతపురం జిల్లా పేరును ఇకపై సత్యసాయి బాబా జిల్లాగా పేరు మార్చాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ దిశగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు ఎన్.రఘువీరా రెడ్డి, శైలజానాథ్‌లు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ముందు మంత్రివర్గంతో పాటు ఉన్నతస్థాయిలో చర్చించి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. కులమతాలకు అతీతంగా శాంతి, ప్రేమ ఆప్యాతానురాగాలకు ఆయన ఒక చిహ్నమని, భక్తిని, సేవను మేళమించి ప్రపంచానికి మార్గనిర్ధేశం చేసిన మహనీయుడు అని సత్యసాయి బాబాను రాజకీయ పార్టీల నేతలు కొనియాడుతున్నారు. "మానవ సేవే మాధవ సేవ" అని ఆచరించి చూపారని, తన హితంకన్నా జనహితమే మేలని ఆయన భావించేవారని, అటువంటి గొప్ప ప్రపంచ సేవకుడ్ని రాష్ట్రమే కాదు ప్రపంచమే కోల్పోయింది. దీనికి చిహ్నంగా అనంతపురం జిల్లా పేరును భగవాన్ సత్యసాయి బాబా పేరుగా మార్చాలని భావిస్తోంది. అలాగే, సాయి నివాసమైన పుట్టపర్తిని ప్రత్యేక పుణ్యక్షేత్రంగా మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.