శోకసంద్రంలో బాబా భక్తులు
posted on Apr 24, 2011 12:05PM
పుట్టపర్తి: భగవాన్
సత్యసాయి బాబా మరణవార్తతో ఆయన భక్తులు విషాదంలో మునిగిపోయారు. తమ దేవుడు ఇక లేడన్న సమాచారంతో భక్తులు నిర్ఘాంతపోయారు. గత 28 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబా కోలుకుంటారని ఎదురుచూసిన భక్తులకు ఈ రోజు చేదు వార్త అందింది. బాబా ఇక లేరన్న చేదు నిజాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబా తిరిగి రారన్న వార్తతో పుట్టపర్తితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు నిశ్చేష్టులయ్యారు. భగవంతుడు అనే పదానికి అర్థం చెప్పిన మహానుభావుడు అస్తమించడంతో భక్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమత, మమత, మానవత పంచిన బాబా మళ్లీ తమకోసం మరో అవతారం ఎత్తుతారని భక్తులు విశ్వాసంతో ఉన్నారు. బాబా మళ్లీ రావా అని ముక్త కంఠంతో నినదిస్తున్నారు.