బాబా మృతికి కంటతడి పెట్టిన అద్వానీ
posted on Apr 24, 2011 11:53AM
పుట్టపర్తి: కోట్లాది భక్తు
లకు ఆరాధ్యుడు అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మృతిని తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ కన్నీరు పెట్టుకున్నారు. బాబా మరణించాడనే వార్త తెలియగానే ఎల్.కె.అద్వానీ మీడియా ముందే కన్నీళ్ల పర్యంతమయ్యారు. బాబా మృతిని తాను తట్టుకోలేక పోతున్నట్టు చెప్పారు. అయితే బాబా అందరి మనసుల్లో ఉన్నారని చెప్పారు. కాగా బాబా మరణ వార్త విని పుట్టపర్తి శాసనసభ్యుడు పల్లె రఘునాథ్ రెడ్డి బోరున విలపించాడు. వెంటనే సొమ్మసిల్లి పడిపోయాడు. పుట్టపర్తిలోని జెండామాను వీధిలో నారాయణమ్మ అనే భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాబా భక్తులు పూర్తిగా దుఖసాగరంలో మునిగి పోయారు. పుట్టపర్తికి బాబా భక్తులను తరలించడానికి రాష్ట్రం, పలు రాష్ట్రాల నుండి ప్రత్యేక బస్సులు ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి.